|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:02 PM
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకెళ్లాలో విపక్షాలతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం అని పేర్కొన్నారు. తెలంగాణాకు గోదావరి, కృష్ణా నదులే ఆధారమని సీఎం రేవంత్ అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఎంపీలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజకీయాల కన్నా తెలంగాణ రైతుల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై విపక్షాలతోనూ చర్చలు జరిపామని బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పరని అన్నారు. తెలంగాణాకు గోదావరి, కృష్ణా నదులే ఆధారమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా రైతుల ప్రయోజనాల కోసం పార్టీలన్నీ దీనిపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మిగులు జలాలపై మొదట మాట్లాడింది కేసీఆరేనని సీఎం రేవంత్ అన్నారు. ఏటా 3వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మాట్లాడారని గుర్తుచేశారు. 2019లో కేసీఆర్, జగన్ కలిసి ఇదే విషయంపై చర్చించుకున్నారని ఆనాడే గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును బీజం పడిందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో సీఎం రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఏపీ సర్కార్ నిర్మించనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలకు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ కేంద్రానికి ఫీజిబులిటీ నివేదిక సమర్పించిందన్నారు. రాష్ట్రంలోకి గోదావరి నది రెంజల్ మండలం కందకుర్తి వద్ద ప్రవేశిస్తుందని, రాష్ట్రంలో గోదావరిపై తొలి ప్రాజెక్టు SRSP అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద 2007లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించారని ఈ ప్రాజెక్టులో భాగంగా 4 రిజర్వాయర్లు డిజైన్ చేశారని, 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో రూపొందించారని వివరించారు. బనకచర్లపై ఏపీ కేంద్రానికి ప్రీ ఫీజబులిటీ రిపోర్టు ఇచ్చిందని, ఏపీ రిపోర్టుపై స్పందించాలని కేంద్రం మమ్మల్ని అడిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మేం పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని, సీఎంతో కలిసి తాను రేపు దిల్లీ వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను తెలుపుతామని అన్నారు.