|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 07:39 PM
జూన్ 18వ తేదీ బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,870 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,400 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,11,800 పలుకుతోంది. పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త వాతావరణమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ఆభరణాల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం తో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా 25 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పతనం అవడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం అటు స్టాక్ మార్కెట్లో నష్టాలను రాజేస్తుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గవర్నమెంట్ కారణంగా అటు అమెరికాలోని ఆశయాలను స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం డాలర్ విలువ పతనం అవ్వడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా బంగారం పైన పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటి ముందుకు దూసుకుని వెళ్తుంది. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ఇదొక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పసిడి ఆభరణాలు మార్కెట్లో రికార్డు స్థాయి వద్ద లభిస్తున్నాయి 22 క్యారెట్ల బంగారం ధర కూడా దాదాపు 93 వేల రూపాయల సమీపానికి చేరుకోవడంతో బంగారు ఆభరణాలు చాలా ఖరీదుగా మారిపోయాయి. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం ఈ పరిణామం ఒకరకంగా లాభదాయకమే అని చెప్పవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ముఖ్యమైన మార్గం గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడమే అని చెప్పవచ్చు. ఫిజికల్ బంగారంతో పోల్చి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టడమే సురక్షితమైన లాభదాయకమైన పెట్టుబడి మార్గం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.