|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 03:19 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులుతుమ్మల నాగేశ్వర్ రావు గారి సమక్షంలో నిర్వహింస్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు,జిల్లా కలెక్టర్ హనుమంత రావు గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతు నేస్తంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ధ్వరా రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.ట్రాక్టర్ పై రైతులతో కలసి రైతు వేదిక వద్దకు వెళ్లారు.అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.