|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:10 PM
హైదరాబాద్‌లోని ఆర్ఆర్ స్టూడియో ఆఫీస్‌లో గిరిజన జన సమితి (GJS) 4వ ఆవిర్భావ సభ పోస్టర్‌ను మంగళవారం ఉదయం వాస్తు పండితుడు కుమారస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సమితి సేవలను ప్రశంసించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
సభ నిర్వహణకు సంబంధించి అన్ని విభాగాల పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ నాయక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతి ఒక్కరూ రావాలి. ఇది గిరిజన సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది,” అని పేర్కొన్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బంజారా ప్రవచనకర్త ఎస్పీ నాయక్, గిరిజన జన సమితి కార్యదర్శి మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.