ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:29 PM
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిద్ధిపేట, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
అలాగే, ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గాలులతో పాటు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.