|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 07:01 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు.ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ 41వ చిత్రంతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ కథా చిత్రంగా రాబోతుండగా..SLVసినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా.. అప్డేట్స్ విడుదల చేస్తారా అని దుల్కర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ 'DQ-41' చిత్రానికి సంబంధించిన డబుల్ అప్డేట్స్ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్లు షూటింగ్ వీడియోను షేర్ చేశారు. ''మంత్రముగ్ధురాలు పూజా హెగ్డే(Pooja Hegde)ను స్వాగతిస్తున్నాము. 'DQ-41' సినిమా కోసం షూట్‌లో చేరారు. దుల్కర్, పూజా కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనుంది. మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి వేచి ఉండండి'' అని రాసుకొచ్చారు. నేటి నుంచి షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం దుల్కర్, పూజాతో పలు సీన్లు చేస్తున్నారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ సూపర్ జోడి అని కామెంట్లు పెడుతున్నారు.
Latest News