|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 06:12 PM
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి దిగిపోయే సినిమాలలో హారర్ కామెడీ జోనర్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ జోనర్ లో రూపొందిన మరో తెలుగు సినిమానే 'బకాసుర రెస్టారెంట్'. ప్రవీణ్ .. వైవా హర్ష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో 'గరుడ' రామ్ కీలకమైన పాత్రను పోషించాడు. ఆగస్టు 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్. జె. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: పరమేశ్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహతులతో కలిసి అతను ఓ రూమ్ లో ఉంటూ ఉంటాడు. ప్రతి రోజూ బాస్ తో చీవాట్లు తినడం కన్నా, సొంతంగా రెస్టారెంట్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వస్తాడు. అందుకు అవసరమైన డబ్బును యూ ట్యూబ్ ద్వారా సంపాదించాలనే అతని అభిప్రాయానికి స్నేహితులు మద్దతునిస్తారు. అయితే దెయ్యలకి సంబంధించిన కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలో .. 'రుద్రారం' అనే విలేజ్ కి దగ్గరలో ఉన్న ఓ పాడుబడిన బంగళాను షూట్ చేయాలనుకుంటారు. చాలా కాలం క్రితం 'ఖాసీమ్ వలి' ఆమె ఒక క్షుద్ర మాంత్రికుడు ఆ బంగళాలో క్షుద్ర పూజలు చేస్తూ ఉండేవాడు. అయితే క్షుద్రపూజలు వికటించడం వలన, అతను అక్కడే చనిపోతాడు. అప్పటి నుంచి ఆ బంగళాలో అతను దెయ్యమై తిరుగుతున్నాడనే ప్రచారం బలంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ బంగళాకి ఈ మిత్ర బృందం చేరుకుంటుంది. ఆ బంగళాలో అడుగుపెట్టిన వారికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాంత్రిక విద్యలకు సంబంధించిన ఒక గ్రంథం అక్కడ వారికి దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని తీసుకుని అక్కడి నుంచి బయటపడతారు. ఆ గ్రంథాన్ని వెంట తీసుకుని వచ్చిన దగ్గర నుంచి వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? బకాసుర ఎవరు? అతని గతం ఎలాంటిది? పరమేశ్ కోరిక నెరవేరుతుందా? అనేది కథ.
Latest News