|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 03:04 PM
టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ క్రేజ్ యువతలో అంతా ఇంతా కాదు. ఈ నటి గీతాంజలి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ అమ్మడు అద్భుతమైన నటన వీక్షించిన దర్శక, నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు. రింగ్ మాస్టర్, దర్బోని, ఇదు ఎన్నమాయం, నేను శైలజ, రెమో, బైరవా, నేను లోకల్, మహానటి, అజ్జాతవాసి, సర్కార్, మిస్ ఇండియా, రంగ్ దే, సర్కారు వారి పాట, దసరా, భోలా శంకర్, రఘు తాత వంటి తెలుగు, హిందీ, మలయాళం, తమిళం చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్‌లో కూడా తన టాలెంట్‌ను పరీక్షించుకుంటుంది. బేబీ జాన్ అనే సినిమాలో నటించి నెటిజన్లను ఆకట్టుకుంది. తన అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది. కీర్తి సురేష్ సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రియుడు ఆంటోనితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కుటుంబ సభ్యుల ఒప్పందంతో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ అటు మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా రాణిస్తోంది. భర్తతో కలిసి అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తూ.. అభిమానులతో పంచుకుని ఆకట్టుకుంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫొటో పంచుకుంది. స్టైలిష్ డ్రెస్ ధరించి డిఫరెంట్ లుక్‌లో దర్శనమివ్వడంతో జనాలు ఫిదా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కీర్తి ఈ పిక్ కు ''నక్షత్రాలతో నిండిన ఆకాశంలో... అక్షరాలా'' అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేసింది.
Latest News