|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:42 AM
ఈమధ్య థియేటర్స్ లో విడుదలైన వెంటనే కొన్ని వారాలు ఆగితే కానీ ఆ సినిమా ఓటిటి లో విడుదలవడం లేదు. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడితే కొన్ని రోజుల గ్యాప్ లోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర' గత వారం విడుదలైంది. ఈ సినిమాకి ప్రముఖ క్యారెక్టర్ నటుడు, రచయిత హర్ష వర్ధన్ దర్శకుడు. ఇందులో ఈషా రెబ్బ, మృణాళిని రవి కథానాయికలుగా కనిపిస్తారు. సునీల్ నారంగ్, పి రామ్ మోహన్ రావు నిర్మాతలు. ఈమధ్య కాలంలో విడుదలైన ఏ సినిమా కూడా అంత తొందరగా ప్రకటించలేదు, తమ సినిమా ఎప్పుడు ఓటిటి లో వస్తుందని, కానీ సుధీర్ బాబు సినిమా మాత్రం థియేటర్స్ లో విడుదలైన రెండో రోజే ఓటిటి విడుదల తేదీ కూడా వచ్చేసింది.
Latest News