|
|
by Suryaa Desk | Mon, Oct 09, 2023, 10:08 PM
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి ఈరోజు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీలమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. అందులో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. మిగిలిన ఇద్దరు విజయసింహా రెడ్డి, నరసింహారెడ్డి.
Latest News