|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 12:02 PM
హీరోయిన్ గా అలరించిన నటి యమున, 50 ఏళ్లు దాటినా అందంగా, ఫిట్ గా కనిపించడానికి తన ఆరోగ్యకరమైన జీవనశైలిని కారణమని తెలిపారు. ప్రతిరోజూ పాజిటివ్ థింకింగ్ తో లేవడం, వ్యాయామం, ధ్యానం చేయడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం వంటివి తన దినచర్యలో భాగమని ఆమె చెప్పారు. ఉదయం 10 గంటలకు మొదటి భోజనం, సాయంత్రం 6:00-6:30 మధ్య రాత్రి భోజనం పూర్తి చేస్తారు. అన్నం పట్ల కృతజ్ఞతతో తినడం, కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ అలవాట్లను తన పిల్లలు కూడా పాటిస్తున్నారని యమున వెల్లడించారు.
Latest News