|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:49 PM
నవంబర్ 14న విడుదలైన ‘జిగ్రీస్' సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో కృష్ణ వోడపల్లి నిర్మించిన ఈ చిత్రం కుటుంబంతో కలిసి చూసేలా అద్భుతమైన భావోద్వేగాలతో, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువ నటీనటుల నటన, సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన ట్రైలర్, సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ, చాణక్య రెడ్డి ఎడిటింగ్ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఈ వీకెండ్‌లో ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌ను తప్పక చూడాలని సూచిస్తున్నారు.
Latest News