|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:20 PM
స్టార్ హీరో రామ్ చరణ్ ఇటీవల కుటుంబంతో కలిసి ప్రత్యేక బిర్యానీ విందును ఆస్వాదించారు. ఆయన నివాసంలో ప్రముఖ జపనీస్ చెఫ్ ఒసావా టకమసా కుండ బిర్యానీ వండి రుచి చూపించారు. 15 ఏళ్ల అనుభవం కలిగిన ఒసావా సింగిల్ పాట్ బిర్యానీలో నిపుణుడిగా పేరొందారు.తక్కువ గ్రేవీతో, అద్భుతమైన సువాసనతో వండిన బిర్యానీని చరణ్, ఆయన తల్లి సురేఖ, అర్ధాంగి ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదలకు సిద్ధమవుతోంది.
Latest News