|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 04:01 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా, వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది.
Latest News