|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 01:47 PM
రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఈ రోజు నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె 'గంగ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక భారీ క్యాసినో బ్యాక్‌డ్రాప్‌లో.. చేతిలో గన్ పట్టుకుని, కళ్లలో తీక్షణతతో నయనతార ఎంతో స్టైలిష్‌గా, అంతే ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. ఆమె హావభావాలు సినిమాలోని ఇంటెన్సిటీని, భారీతనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పాత్ర గురించి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నయనతార స్టార్ డమ్ గురించి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ 'టాక్సిక్'లో ఆమెలోని సరికొత్త నటనా ప్రతిభను చూస్తారు. షూటింగ్ జరుగుతున్న కొద్దీ గంగ పాత్ర ఆత్మకు, నయనతార వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని నేను గమనించాను" అని ఆమె పేర్కొన్నారు.
Latest News