|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 07:14 PM
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజును శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సల్మాన్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. 'నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది నీకు అపారమైన ఆనందాన్ని, ఆయురారోగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.
Latest News