|
|
by Suryaa Desk | Sat, Dec 27, 2025, 10:14 PM
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "వారణాసి" టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించబడుతుంది.మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించబడుతోంది. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌లో కే.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని దాదాపు రూ.1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రోటర్' అనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి, ఈ చిత్ర టైటిల్ అధికారికంగా ప్రకటించడమే కాక, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది. వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవ్వడం, అంతర్జాతీయ స్థాయిలో మూవీపై అంచనాలను మరింత పెంచింది.భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక అంశాలు, టైం ట్రావెల్ కాన్సెప్ట్లను మిళితంగా చేసి, గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.మహేష్ బాబు ఈ చిత్రంలో మొత్తం ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలిపిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. ఐదు పాత్రలలో ప్రధానమైనది 'రుద్ర' అని, ఇది సినిమాకి హైలైట్‌గా ఉండబోతోంది. అలాగే, మహేష్ రాముడు మరియు శివుడి రూపాల్లోనూ కనిపిస్తారని అంటున్నారు. మిగతా రెండు పాత్రలు కూడా ప్రత్యేకమైన గెటప్స్‌లో సూపర్‌స్టార్ అలరిస్తారు.ఇప్పటికే 'రుద్ర' పాత్రలో మహేష్ బాబు ఎద్దుపై కూర్చుని త్రిశూలం పట్టుకున్న గ్లింప్స్ ఈవెంట్‌లో రిలీజ్ అయ్యాయి. ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో మందాకిని అనే కీలక పాత్రలో నటిస్తూ, ఫస్ట్ లుక్‌లో చీర కట్టులో గన్ పట్టుకుని యాక్షన్ చేస్తున్నది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పాత్రలో కనిపిస్తున్నాడు.
Latest News