|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 01:43 PM
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, గ్లింప్స్ చిరంజీవిని చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ అండ్ స్టైలిష్ అవతార్‌లో చూపిస్తూ సోషల్ మీడియాలో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గ ఎలివేషన్లు ఇచ్చాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.ఈ సినిమాపై అంచనాలు పెరగడంలో పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిరంజీవి – నయనతార జోడీపై చిత్రీకరించిన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ అయితే అభిమానుల్లో నిజంగానే పండగ జోష్ నింపింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేశ్ స్టెప్పులేయడం థియేటర్లలో పూనకాలు ఖాయం అనేలా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో డ్యాన్స్ చేయడం, అది కూడా ఫుల్ మాస్ టోన్‌లో ఉండటంతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సంక్రాంతి సీజన్‌లో అనిల్ రావిపూడికి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డ్, దానికి చిరంజీవి క్రేజ్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మేకర్స్ కూడా అదే కాన్ఫిడెన్స్‌తో ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఓవర్సీస్‌లో ‘సరిగమ సినిమాస్’ ద్వారా జనవరి 11న గ్రాండ్ ప్రీమియర్స్‌తో సినిమాను విడుదల చేయనున్నారు.
Latest News