|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:14 PM
టాలీవుడ్ నటుడు నవీన్ పొలిశెట్టి మరోసారి తన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి కథానాయికగా కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకలో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్స్ వరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే నవీన్ పెళ్లి అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. "ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే.. కరెక్ట్‌గా 12 గంటల తర్వాత నేను కూడా వివాహం చేసుకుంటా" అంటూ నవ్వులు పూయించాడు.
Latest News