|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 04:02 PM
టాలీవుడ్ హీరో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్‌గా, హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి బరిలో 'రాజాసాబ్', 'జననాయగణ్', 'పరాశక్తి', 'శంకరవరప్రసాద్', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు' వంటి పలు చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.
Latest News