|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:31 PM
సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సౌజన్య శ్రీనివాస్ మరోసారి తన నాట్య ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. ‘మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో ఇటీవల నిర్వహించిన ‘భావ రస నాట్యోత్సవం - సీజన్ 1’లో భరతనాట్యం, మోహినియాట్టం వంటి శాస్త్రీయ నృత్యరూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ భరతనాట్య ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ మోహినియాట్టం ప్రదర్శించారు. హైదరాబాద్‌కు చెందిన సౌజన్య శ్రీనివాస్ చేసిన భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. రాగమాలిక రాగంలో ఆదిశంకరాచార్యులు స్వరపరచిన అర్ధనారీశ్వర స్తోత్రానికి సౌజన్య చేసిన అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే శ్రీ రాగంలో త్యాగరాజ కృతి ‘ఎందరో మహానుభావులు’కు ఆమె చేసిన నృత్య ప్రదర్శన శాస్త్రీయ కళా వైభవాన్ని ప్రతిబింబించింది.
Latest News