|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:44 PM
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం అఖండ-2, సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో 2 గంటల 45 నిమిషాలున్న ఈ సినిమా, ఓటీటీలో 2 గంటల 20 నిమిషాలకు తగ్గించారు. దాదాపు 25 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తొలగించినట్లు సమాచారం. చైనా ఆర్మీ జనరల్ కుట్ర, బయోవార్, మహా కుంభమేళలో విష ప్రయోగం, దేవుడిపై నమ్మకం కోల్పోవడం, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ కూతురు జనని, అఖండ పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.
Latest News