|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:06 PM
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’ నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆమె ‘భారతి’ పాత్రలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా లంగావోణీలో అందంగా కనిపిస్తోంది. “వెన్నెలల్లే ఉంటాది మా భారతి” అంటూ చిత్ర యూనిట్ ఆమె పాత్రను పరిచయం చేసింది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి జనవరి 5న మొదటి పాట విడుదల కానుంది. 2026 వేసవిలో సినిమా విడుదల కానుంది.
Latest News