|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 03:22 PM
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం చిరంజీవి, వెంకటేష్‌లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. అయితే ఈ రోజు (గురువారం) ఈ ఇంటర్వ్యూకు జరగనుందని, దీనికి దర్శకుడు అనిల్ రావిపూడి లేదా హీరో తేజ సజ్జ హోస్టుగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి విషయాలు చర్చిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News