|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:55 AM
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రం విడుదలైన తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకు వచ్చాయని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసిందని 'sacnilk' తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతుండగా, తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి రోజు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ సెంటర్స్‌లో మార్నింగ్ షోల నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫ్యాన్స్ షోలలో సంబరాలు, కటౌట్లు, బ్యానర్లు కనిపించగా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్రమంగా థియేటర్లకు రావడం ప్రారంభించారు. టాక్ ఎలా ఉన్నా, ఓపెనింగ్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం ‘ది రాజా సాబ్’ అంచనాలను మించిన స్థాయిలో రాణించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News