|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 11:19 AM
దర్శకుడు ఆదిత్యాధర్ తెరకెక్కించిన 'దురంధర్' సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టించింది. దేశభక్తి, తీవ్రవాదం, గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. దర్శకుడు ఆదిత్యాధర్ ప్రతిభను ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా, వివేక్ అగ్నిహోత్రి వంటి ప్రముఖులు ప్రశంసించారు. తాజాగా నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాను సమీక్షించి, దర్శకుడు ఆదిత్యాధర్, కథాంశం, నటీనటులను అభినందించారు. ముఖ్యంగా రెహమాన్ డకాయిత్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా నటనను ఆయన ప్రశంసించారు.
Latest News