|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 01:41 PM
స్టార్ హీరో దళపతి విజయ్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. మన శంకరవరప్రసాద్‌గారు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ విజయ్ చివరి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు."విజయ్ గారు తన చివరి సినిమాకు దర్శకత్వం చేయమని అడిగారు. భగవంత్ కేసరి మూవీపై ఆయనకు ఎంతో నమ్మకం ఉంది. గతంలో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ప్రతిపాదనతో నా దగ్గరకు వచ్చారు. అయితే విజయ్ గారితో స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే నేను రీమేక్‌కు ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఇది ఆయన చివరి ఫిల్మ్ కావడంతో, రీమేక్ చేస్తే ఎలా ఉంటుందోనన్న భయం కూడా ఉంది. అందుకే దర్శకత్వం చేసే ధైర్యం చేయలేకపోయాను" అని చెప్పారు.అయితే, ‘భగవంత్ కేసరి’ సినిమా విజయ్ గారికి చాలా నచ్చడంతో, ఆయన పట్టుబట్టి ఈ సినిమాను రీమేక్ చేశారని అనిల్ రావిపూడి తెలిపారు. ‘జన నాయగన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.
Latest News