|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 12:36 PM
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వింటేజ్ మాస్ మ్యాజిక్‌తో ప్రేక్షకులను అలరించారు. 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా చూసిన తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ‘బాస్ ఈజ్ బాస్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న థియేటర్‌లలో విడుదలైంది. చిరంజీవి ఈ చిత్రంలో పూర్తి వింటేజ్ లుక్‌తో, కామెడీ టైమింగ్, మాస్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ చూసిన అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. చిరంజీవి నటన, డ్యాన్స్‌పై అరవింద్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘బాస్ ఈజ్ బాస్.. చించేశాడు’ అంటూ వ్యాఖ్యానించారు.
Latest News