|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 04:07 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'ఆంధ్రావాలా' సినిమా రీ రిలీజ్ కానుంది. 2004లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయినా, ఆడియో ఫంక్షన్ కు 10 లక్షల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ నెల 26న సినిమా రీ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అభిమానులు మరోసారి థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆనందించడానికి సిద్ధమవుతున్నారు.
Latest News