|
|
by Suryaa Desk | Thu, Sep 25, 2025, 05:58 PM
నేడు ‘ఓజీ’ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు సుజీత్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. "They Call Him OG మీ ముందుకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల ప్రయాణం చివరకు పూర్తైంది. ఉత్సాహంతో పాటు కొంత బాధ కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా డైరెక్షన్, టెక్నీషియన్ టీంకి ‘ఐ లవ్ యూ’! ఇంకా ఎంత చెప్పినా తక్కువే. నన్ను నమ్మిన మా నిర్మాతలు దానయ్య, కల్యాణ్ దాసరి, సినిమా కోసం ఎంతో కష్టపడ్డ తమన్ అన్నకి థ్యాంక్స్. సినిమాటోగ్రాఫర్ నవీన్ నూలి బ్రో.. నీ మ్యాజిక్ తెరపై ఆడియన్స్ చూసే క్షణాన్ని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్‌నెస్ ఊహించలేనిది! ఇది కేవలం ఆరంభం మాత్రమే. అన్నీ బాగుంటే ‘ఓజీ’ ఇంకా పెద్దదిగా మారుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్" అంటూ రాసుకొచ్చారు.
Latest News