|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 12:12 PM
ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిలా గొంతు మార్చి ఓ యువకుడిని మోసం చేసి రూ. 8 లక్షలు కొట్టేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోత్ మంజి (కృష్ణవేణిగా గొంతు మార్చిన వ్యక్తి), భూక్యా గణేశ్, రూపవత్ శ్రావణ్ కుమార్ లను ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పెళ్లి కోసం ఆన్లైన్లో వెతుకుతున్న లక్ష్మీకాంత్కు శ్రావణ్ కుమార్ కృష్ణవేణి అనే అమ్మాయిగా పరిచయమై, తాను ధనవంతురాలినని, ఆస్తులు కోర్టులో చిక్కుకున్నాయని నమ్మించి, లాయర్ ఫీజుల పేరుతో విడతల వారీగా రూ. 8 లక్షలు కాజేశాడు. నిందితులను సూర్యాపేటలో అరెస్ట్ చేసి, రూ.1.50 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు