|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:29 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తన నామినేషన్ తిరస్కరణకు గురైన మరుసటి రోజే హైదరాబాద్ యూత్ కరేజ్ (హెచ్‌వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు సమక్షంలో నేడు తెలంగాణ భవన్‌లో సల్మాన్ ఖాన్ అధికారికంగా పార్టీలో చేరనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఆయన వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.అంతకుముందు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితోనే రిటర్నింగ్ అధికారి తన నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆరోపించారు. ఎలాంటి సరైన కారణం లేకుండా తన నాలుగు నామినేషన్ పత్రాలను పక్కనపెట్టారని ఆయన పేర్కొన్నారు.