ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:49 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గేట్ వద్ద గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్, వడ్ల రవిగా గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో ఉద్యోగం నిమిత్తం బయలుదేరినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ప్రయాణిస్తున్న స్కూటీకి నంబర్ ప్లేటు లేదని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.