|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:45 PM
అమీన్పూర్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించాలన్న లక్ష్యంతో చందానగర్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ నుండి బంధం కొమ్మ మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం వరకు 45 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న 150 అడుగుల రహదారి విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని.. త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బంధం కొమ్ము పరిధిలో ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న రహదారి విస్తరణ పనుల అంశంలో సమస్యలు ఎదురైన వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే బంధం కొమ్ము రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, నీటిపారుదల శాఖ డి ఈ రామస్వామి, జిహెచ్ఎంసి ఏ ఈ సౌమ్య,మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.