|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:27 PM
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన మహ్మద్ అనే యువకుడు ఇక్కడి ప్రగతినగర్‌లో నివసిస్తూ ఓ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మెట్రో రైలు ఎక్కేందుకు మూసాపేట స్టేషన్‌కు వచ్చాడు. ప్రవేశ ద్వారం వద్ద లగేజీ స్కానింగ్ కోసం తన బ్యాగును యంత్రంలో పెట్టగా, అందులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బ్యాగును తనిఖీ చేయగా, అందులో 9 ఎంఎం బుల్లెట్ ఒకటి బయటపడింది.దీంతో షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెట్రో అధికారుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ బుల్లెట్ యువకుడి వద్దకు ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు.