|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 02:31 PM
గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు. హైదరాబాద్–సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో కూతురు(8), కుమారుడు(7) లతో నివసిస్తూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న దంపతులు. దంపతులిద్దరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో, ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచిన యువకుడు. సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన నిందితుడు. బాలిక అనారోగ్యానికి గురవ్వగా, నిలదీసిన తల్లిదండ్రులకు వాస్తవాన్ని చెప్పిన చిన్నారి తమ్ముడుచైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు