|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 03:10 PM
కలిసి కట్టుగా శ్రమించి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించుకుందామని అంబర్ పేట ఎమ్మెల్యే, యూసఫ్ గూడ డివిజన్ ఇంచార్జ్ కాలేరు వెంకటేష్ గారు పిలుపునిచ్చారు. యూసఫ్ గూడ బీఆర్ఎస్ కార్యాలయంలో బూత్ ఇంఛార్జ్ ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.మాగంటి గోపీనాథ్ లేని లోటును ఉప ఎన్నికల్లో సునీతమ్మను గెలిపించడం ద్వారా తీర్చుకోవాలన్నారు. యూసఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షులు నీలం సంతోష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, అంబర్ పేట ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.