ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 02:33 PM
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం కూడా భారీగా రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయదశమికి సొంత ఊర్లకు వెళ్లినవారు ఆదివారం నుంచి హైదరాబాద్కు తిరుగుపయనమవ్వడంతో ఈ రద్దీ ఏర్పడింది. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న రహదారి పనులు కూడా రద్దీ పెరగడానికి మరో కారణమయ్యాయి. విజయదశమి, సంక్రాంతి పండుగలకు ప్రతి ఏటా ఇక్కడ వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.