|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:02 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. ఆదివాసీ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సీఎం దర్శించుకున్నారు. ఆయన అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. వ్యక్తిగతంగా మొక్కుకున్నట్లు చెబుతూ, తన మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం, భక్తులతో కాసేపు ముచ్చటించారు.
ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గ సభ్యులంతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడి దృష్ట్యా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
తరువాత మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భక్తులకు మరింత సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించినట్లు సమాచారం.