|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:02 PM
పటాన్చెరు : దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో గల శ్రీ స్వయం భూ తుల్జా భవాని మాత దేవాలయాన్ని మంగళవారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమానికి లక్ష రూపాయల సొంతినిధులను విరాళంగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం భూగా వెలసిన అమ్మవారి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.