|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 02:00 PM
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఉదయం నుంచి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.