ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 06:53 PM
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సోమవారం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన రాయికోడ్ లోని ముమ్మదేవి అమ్మవారికి అర్చకుల ఆధ్వర్యంలో వేకువజామున సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. భక్తులు డప్పుచప్పులతో వాగుకు వెళ్లి గంగజలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నైవేద్యం, మహాహారతి సమర్పించారు. మొదటిరోజు బాల త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.