|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 12:58 PM
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కార్మికులకు 34శాతం లాభాల్లో వాటా ప్రకటించింది. రూ.810కోట్లు లాభం ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రెగ్యులర్ కార్మికులకు రూ.1,95,610 పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థ మొత్తంగా రూ.6,394 కోట్లు ఆర్జించిందని వివరించారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మవంటిది. ఈ సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు.. అది ఒక ఉద్యోగ గని. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న యాజమాన్యానికి అభినందనలు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారు. కోల్‌ఇండియాలో ఇవ్వని అలవెన్సులు కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం” అని తెలిపారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. సంస్థ మొత్తం రూ.6,394 కోట్లు అర్జించిందని అన్నారు.