|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 04:49 PM
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, ఇవాళ ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు.