|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 11:23 PM
హైదరాబాద్‌లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలుచోట్ల విస్తారంగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది. ప్రధాన రహదారులన్నీ జలమయమవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.వర్షం వల్ల ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడింది.అంబర్‌పేట్, కాచిగూడ, నారాయణగూడ, బర్కత్‌పూర్, నల్లకుంట, ఉప్పల్, రామంతపూర్, కాప్రా, జవహర్‌నగర్, ECIL, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చాంద్రాయణగుట్ట, తార్నాక, మల్కాజ్‌గిరి, మౌలాలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాలు వర్షంతో పూర్తిగా నీటమునిగిపోయాయి.ఇక ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, వీధులు చెరువులను తలపించేలా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.ఇంకా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది, దాంతో రాత్రిపూట సమస్యలు మరింతగా పెరిగిపోయాయి.