|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 10:18 PM
భూమి కనిపిస్తే చాలు.. దానిపై కబ్జా చేసేందుకు కొందరు వెనుకాడటం లేదు. అది అమాయకులదైతే మాత్రం మాయమాటలు, బెదిరింపులు – ఇలా అన్నిరకాల ఆటలు ఆడుతున్నారు.వికారాబాద్ జిల్లా రాకంచెర్ల గ్రామంలో అలాంటి ఘట్టం చోటు చేసుకుంది. విలువైన 5 కోట్ల రూపాయల భూమిని కేవలం 5 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకుని భూదందా నిర్వహించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పూడూరు మండలం రాకంచెర్లకు చెందిన కురువ పద్మమ్మ అనే మహిళ ప్రస్తుతం హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ అనే మహిళ ఇంట్లో గృహ ఉద్యోగిగా పని చేస్తోంది. పద్మమ్మకు స్వగ్రామమైన పెద్ద ఉమ్మేంతాలలో 2 ఎకరాల భూమి ఉంది. అయితే సాగునీరు లేక పంటలు పండించలేక పొట్టి పోయి ఉపాధి కోసం నగరానికి వెళ్లింది.ఈ నేపథ్యంలో పద్మమ్మ భూమి విషయం పోచమ్మకు తెలిసింది. ఆ సమాచారం ఆధారంగా ఆమె మెల్లగా మాయ మాటలు చెప్పి, ఆ భూమిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసింది. సుమారు రూ.5 కోట్ల విలువ గల భూమిని కేవలం రూ.5 లక్షలతో తన పేర రిజిస్టర్ చేసుకుంది.అయితే రిజిస్ట్రేషన్ అనంతరం భూమిపై సర్వే నెంబర్ 401లో సర్వే జరుగుతుండగా విషయం పద్మమ్మ కుమారుడు సురేష్‌కు తెలిసింది. వెంటనే ఆయన గ్రామస్తులకు వివరించి, అందరితో కలిసి భూమి వద్దకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులను పోచమ్మ తరఫున వచ్చిన దాదాపు 100 మంది గుండాలు బెదిరించారట.“తల్లిని మోసం చేసి, మేము నమ్మకంగా ఉన్న సమయంలో భూమిని దొంగిలించారు” అని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం గ్రామస్థాయిని దాటి పోలీస్ స్టేషన్ దాకా చేరింది.పోలీసులు ఈ వ్యవహారంలో నిందితురాలైన పోచమ్మ పంపిన కిరాయి గుండాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికులు పోలీసులకు తెలిపారు ప్రకారం, వారి వద్ద కత్తులు, లాఠీలు ఉన్నాయి.పోచమ్మ కుమారుడు కలెక్టర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తన కుమారుడి అధికార బలాన్ని వినియోగించి భూమిని కబ్జా చేయించినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఇక ఈ ఘటనపై మాజీ సర్పంచ్ పెంటయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, రెవెన్యూ అధికారులను కోరారు.రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని, తహసీల్దార్లకు సూచించారు.