|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:20 PM
అశోక్‌నగర్‌లోంచి హుస్సేన్‌సాగర్ వరద కాలువను అనుసంధానం చేసే నాలాను విస్తరిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు. భారీ వర్షాలు పడినప్పుడు ఇందిరాపార్కు నుంచి వచ్చే వరద మొత్తం అశోక్‌నగర్ మీద పడుతోందని.. ఇక్కడ ఉన్న కాలువను ఆక్రమించి నిర్మాణం చేయడంతో ఇబ్బంది తలెత్తుతోందని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. దీంతో వరద 6 అడుగుల మేర నిలిచిపోయి..ఆఖరుకు హుస్సేన్‌సాగర్ వరద కాలువకు దేవాలయం వద్ద ఉన్న రిటైనింగ్ వాల్ పడిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతాలను పర్యటించిన హైడ్రా కమిషనర్ వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతో పాటు.. అశోక్‌నగర్‌లో నాలాను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య, డీఎఫ్‌వోలు శ్రీ యజ్ఞనారాయణ, శ్రీ గౌతం, ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ రామానుజుల రెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీరు శ్రీనివాస్ తదితరులు హైడ్రా కమిషనర్ పర్యటనలో ఉన్నారు.