|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 08:11 PM
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా సరిపడా యూరియా రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. యూరియా కొరతకు కేంద్రమే కారణమని దుయ్యబట్టారు. BRS యూరియాకు కృత్రిమ కొరతను సృష్టిస్తుందని విమర్శించారు. ఎరువులు సరిపడా ఉత్పత్తి జరగడం లేదన్నారు. రాష్ట్రానికి తగినంత యూరియా ఇవ్వాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.