|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 08:10 PM
నాగార్జున ప్రభుత్వ కళాశాల బీఎస్సీ ఎంపీసీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఎన్ మనోజ్, తెలంగాణ స్టేట్ టైక్వాండో అసోసియేషన్ రాష్ట్రస్థాయి పోటీలలో అండర్ 73 కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఈ విజయం ద్వారా అతను జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరగనున్న జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, అధ్యాపకులు, విద్యార్థులు మనోజ్‌ను అభినందించారు.