ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 06:09 AM
పర్యావరణహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ప్రజలకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె తెలిపారు.జీహెచ్ఎంసీ తరఫున 2 లక్షల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీకి సిద్ధం చేశామని ఆమె వెల్లడించారు. గణేశ్ పండుగ కోసం 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, వీధిలైట్లు, చెట్ల తొలగింపు, రోడ్ల మరమ్మతులు, నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలియజేశారు.